DSports Dec17 2025: దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో ముంబై వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు విధ్వంసం సృష్టించాడు. మలేషియా బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 121 బంతుల్లోనే తన ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.125 బంతుల్లో 209 పరుగులు (నాటౌట్).17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు.నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు.భారత్ 315 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.యూత్ వన్డే (U-19 ODI) చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా అభిజ్ఞాన్ చరిత్ర పుటల్లోకెక్కాడు.2002లో ఇంగ్లండ్‌పై అంబటి రాయుడు చేసిన 177 పరుగుల రికార్డును (భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు) 23 ఏళ్ల తర్వాత అభిజ్ఞాన్ అధిగమించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన జోరిచ్ వాన్ షాల్క్‌విక్ (215) తర్వాత అభిజ్ఞాన్ (209*) రెండో స్థానంలో నిలిచాడు. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా (121 బంతుల్లో) డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు. 17 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందే ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం విశేషం. అయితే ప్రస్తుత వేలం జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో టీమిండియా స్టార్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ భారత్ అదరగొట్టింది. దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లతో మలేషియాను 93 పరుగులకే కుప్పకూల్చాడు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana