DSports 18Feb 2026:కొలంబో: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారత్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, ఇప్పటికే సూపర్-8లోకి దూసుకెళ్లింది. ఈ ఘోర పరాజయంపై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్, తన యూట్యూబ్ ఛానెల్ ‘యాష్ కీ బాత్’ (Ash Ki Baat) వేదికగా పాక్ వైఫల్యాలను ఎండగట్టారు. అసలు పాకిస్థాన్ ఎక్కడ తప్పు చేసిందో ఆయన క్లియర్ గా వివరించారు.

  • అశ్విన్ అభిప్రాయం ప్రకారం, పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే వారు చేసిన మొదటి మరియు అతిపెద్ద తప్పు.”కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్‌పై ఛేజింగ్ చేయడం చాలా కష్టం. ఈ వరల్డ్ కప్‌లో గత మ్యాచులను చూస్తే, చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేయడం అసాధ్యంగా మారుతోంది. ఐపీఎల్ లాగా ఇక్కడ ఈజీగా ఛేజ్ చేయలేరు. 175 పరుగులు ఈ పిచ్‌పై 200 రన్స్‌తో సమానం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడే పాక్ సగం మ్యాచ్ ఓడిపోయింది” అని అశ్విన్ విశ్లేషించారు.
  • బౌలింగ్ మార్పుల విషయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వ్యూహాలను అశ్విన్ తప్పుబట్టారు.మొదటి ఓవర్‌లో సల్మాన్ ఆఘా వేసి అభిషేక్ శర్మ వికెట్ తీసినప్పటికీ, రెండో ఓవర్‌ను షహీన్ అఫ్రిదికి ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. “ఇషాన్ కిషన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్లను ఊచకోత కోస్తాడని డేటా చెబుతోంది. షహీన్ అఫ్రిదిని రెండో ఓవర్‌కు తీసుకురావడం వల్ల భారత బ్యాటర్లపై ఉన్న ఒత్తిడి తగ్గిపోయింది. షహీన్ ధారాళంగా పరుగులు ఇస్తున్నా, అతనితోనే బౌలింగ్ చేయించడం పెద్ద బ్లండర్” అని పేర్కొన్నారు.
  • పాకిస్థాన్ బ్యాటింగ్‌ను ఎగతాళి చేస్తూ అశ్విన్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు.భారత్ చేసిన 175 పరుగులకు పాకిస్థాన్ కనీసం పోరాడలేకపోయింది. టీ20ల్లో కూడా ‘ఫాలో-ఆన్’ రూల్ ఉంటే, భారత్ మరో 20 పరుగులు చేసి పాకిస్థాన్‌కు ఫాలో-ఆన్ ఇచ్చేది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారత్ కంటే పాక్ 100 రెట్లు వెనుకబడి ఉంది” అని ఎద్దేవా చేశారు.