
DNews:09 Feb: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి నేడు సాయంత్రం 5 గంటలతో తెరపడింది.ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ప్రచారం ముగియడంతో ఇకపై బహిరంగ సభలు, ఊరేగింపులు, మైకుల వినియోగంపై నిషేధం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది.ఎన్నికల నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటల నుండి ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు (48 గంటల పాటు) మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సుమారు 52.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.గడిచిన కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మరియు జనసేన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారాన్ని హోరెత్తించారు. ఇప్పుడు అభ్యర్థులు ‘డోర్ టు డోర్’ ప్రచారంపై దృష్టి సారించనున్నారు.
