
DSports Jan05 2026: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బంగ్లాదేశ్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గత కొంతకాలంగా జట్టులో నెలకొన్న అనిశ్చితి, నాయకత్వ మార్పుల నేపథ్యంలో నజ్ముల్ హొసైన్ షాంటో స్థానంలో లిట్టన్ దాస్‌ను కెప్టెన్‌గా నియమించారు. మే 2025లోనే ఆయనను టీ20 ఫార్మాట్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించగా, ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించే బాధ్యతను బోర్డు అప్పగించింది.
లిట్టన్ కుమార్ దాస్ బంగ్లాదేశ్ క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో ఒకరు. 1994, అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు.2015లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది వన్డే, టీ20ల్లోనూ డెబ్యూ చేశారు.వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (176 పరుగులు, జింబాబ్వేపై) సాధించిన రికార్డు ఆయన పేరిటే ఉంది.2018 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై శతకం బాది అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ మ్యాచ్‌లో బంగ్లా ఓడినా లిట్టన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
హిందూ మతానికి చెందిన వ్యక్తి కావడంతో బంగ్లాదేశ్‌లో ఆయన తరచుగా మతపరమైన వేధింపులకు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురవుతుంటారు. అయినప్పటికీ తన ఆటపైనే దృష్టి పెట్టి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగారు.
