DSports Jan10 2026:ముంబై: మైదానంలో పరుగుల వరద పారించిన సునీల్ గావస్కర్, ఇప్పుడు తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి ఆయన పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

  • 2025 మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలో గావస్కర్ ఒక ఆసక్తికరమైన హామీ ఇచ్చారు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై జెమీమా అద్భుత సెంచరీతో రాణించినప్పుడు, భారత్ కనుక ప్రపంచకప్ గెలిస్తే.. జెమీమా గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని ఆయన ప్రామిస్ చేశారు.నవంబర్ 2025లో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులు వీరిద్దరి ‘డ్యుయెట్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.