DSports Jan10 2026:ముంబై: మైదానంలో ఎప్పుడూ సరదాగా, చురుగ్గా కనిపించే జెమీమా రోడ్రిగ్స్ వెనుక ఒక విషాదకరమైన జ్ఞాపకం ఉంది. ప్రముఖ టాక్ షో ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ లో పాల్గొన్న జెమీమా, తాను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం గురించి వివరించారు.

  • జెమీమాకు 8 ఏళ్లు ఉన్నప్పుడు తన బంధువులతో కలిసి ఒక చర్చి కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పిల్లలంతా కలిసి ‘చప్పల్ ఫైట్’ (చెప్పులతో కొట్టుకునే ఆట) ఆడుకుంటున్నారు.
  • ఆటలో భాగంగా జెమీమా కజిన్ తన చెప్పును మొదటి అంతస్తు గ్యాలరీ అవతలికి విసిరారు. దాన్ని తీసుకురావడానికి జెమీమా ఒక ‘సూపర్ హీరో’లా ఫీలవుతూ ఏమాత్రం ఆలోచించకుండా మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు.
  • అదృష్టవశాత్తూ జెమీమా నేరుగా కింద కూర్చుని ఉన్న ఒక వ్యక్తి తల మీద పడ్డారు. దీనివల్ల ఆమెకు ఎముకలు విరగడం వంటి పెద్ద గాయాలేమీ కాలేదు.
  • ఆమె కింద పడిపోయిన తీరు చూసి, అక్కడున్న తన కజిన్స్ అంతా జెమీమా చనిపోయిందని భావించి భయంతో వణికిపోయారట.