D Spiritual: Nov 14: 1. సూర్య అర్ఘ్య నియమం యొక్క మహత్యం
సమస్త జీవజాలానికి సూర్యుడు ప్రాణాధారం అని మనకు తెలిసిందే. అందుకే ఆయనను ఆదిదేవుడు, ఆరోగ్య ప్రదాతగా పూజిస్తారు. ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే సకల సంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. అయితే అర్ఘ్యం ఇవ్వడంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితుల అభిప్రాయం.

2. బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం
సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలనుకునే వారు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి పవిత్రంగా స్నానం చేయాలి. శుభ్రమైన, ఉతికిన దుస్తులను ధరించాలి. శుచిగా సిద్ధమైన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం పుణ్యఫలాన్ని పెంచుతుంది.

3. అర్ఘ్యం ఇచ్చే విధి
అర్ఘ్యం ఇచ్చిన తరువాత దూప దీపాలతో, పసుపు-కుంకుమలతో సూర్యడిని నమస్కరించడం ఆచారంగా ఉంది. మూడు సార్లు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీటిలో ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలను వేసి సూర్యుడికి సమర్పించాలి. మూడు సార్లు అర్ఘ్యం ఇచ్చిన తరువాత భూదేవికి నమస్కారం చేసి ‘ఓం నమో సూర్యాయ నమః’ అనే మంత్రం జపించాలి.

4. అనంతర పూజా విధానం
సూర్య అర్ఘ్యం అనంతరం ఇంట్లో దీపారాధన చేయాలి. చాలామంది ఉదయం, సాయంత్రం రెండుసార్లు అర్ఘ్యం ఇస్తుంటారు. అయితే విశేష ఫలితాల కోసం ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడమే శ్రేష్ఠమని పండితులు సూచిస్తున్నారు.

5. అర్ఘ్య సమర్పణ ఫలితాలు
ప్రతిరోజూ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పురాణాలు చెప్పాయి. దీని ద్వారా సిరిసంపదలు పెరిగి, జీవితంలో శుభఫలితాలు పొందవచ్చని నమ్మకం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana