DSports 26 Nov: భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసియా-పసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లేఆఫ్ టోర్నమెంట్‌లో అద్భుతమైన శుభారంభం చేసి క్వార్టర్-ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. చైనాలోని చెంగ్డూ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో, ఆరో సీడ్ అయిన నాగల్, తొలి రౌండ్‌లో చైనాకే చెందిన ఝాంగ్ మింగ్‌హుయ్‌పై పోరాడి గెలిచాడు.

మొదటి సెట్‌లో కాస్త తడబడి 2-6 తేడాతో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకున్న నాగల్ తన అనుభవాన్ని రంగరించి, మిగిలిన రెండు సెట్‌లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-0, 6-2 తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయం నాగల్‌కు 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొందే అవకాశాన్ని మరింత చేరువ చేసింది. కాగా, ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు చైనా వీసా సమస్య తలెత్తినా, దానిని పరిష్కరించుకొని బరిలోకి దిగిన నాగల్, తన అద్భుత ప్రదర్శనతో భారత అభిమానులను సంతోషపరిచాడు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana