D Spiritual: Nov 22: జీవితంలో విజయాన్ని సాధించాలంటే ప్రతి వ్యక్తి కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఒక నిర్ణీత లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, దానిని చేరుకునేందుకు శ్రమతో పాటు సమయాన్ని వెచ్చించడం అత్యంత కీలకం. ఈ నేపథ్యాల్లో, ప్రాచీన హిందూ సనాతన ధర్మంలో సూచించిన కొన్నిచిన్న నియమాలు జీవనంలో విజయాన్ని సులభం చేస్తాయని భావిస్తున్నారు.

హిందూ సనాతన విశ్వాసాల ప్రకారం, మనకు వచ్చిన కష్టాలు, సమస్యలను తగ్గించేందుకు అనేక ఆచారాలు, చర్యలు ఉన్నాయని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ చిన్న చిన్న ఆచారాలను నిరంతరం పాటించడం ద్వారా జీవితంలోని ఇబ్బందులు స్వయంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. ఈ నియమాలను రోజువారీ దినచర్యలో చేర్చుకుంటే విజయపథం మరింత సులభమవుతుందని విశ్వాసం.

ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వులతో పాటు నీటిని సమర్పించి నమస్కారం చేయడం అత్యంత శుభప్రదం అని సూచిస్తున్నారు. ఈ నియమాన్ని పాటించే వారికి పనులు సాఫీగా పూర్తి అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్యారాధన శక్తిని, ఉత్సాహాన్ని పెంచుతుందని భావిస్తారు.

అంతేకాకుండా, ప్రతిరోజూ తులసి మొక్కకు నీటిని సమర్పించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం కూడా అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతోంది. తులసి పూజ మనసుకు శాంతిని, ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుందని హిందూ మతం నమ్ముతుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana