D News: Speaker Comments తెలంగాణ అసెంబ్లీ వివాదంపై మరోసారి రాజకీయ దుమారం రేపాయి. హరీష్ రావు క్షమాపణ చెబుతారని భావించానని, కానీ అసలు అంశాన్ని పక్కదారి పట్టించేలా ఆయన మాట్లాడారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

హరీష్ రావు క్షమాపణ చెబుతారని భావించా

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని గడ్డం ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభాపతి స్థానాన్ని అవమానించిన ఘటనపై హరీష్ రావు క్షమాపణ చెబుతారని భావించానని, కానీ ఆయన డైవర్షన్ రాజకీయాలు చేశారని వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ మహిళా సభ్యుల ఆరోపణలపై చర్యలు

బీఆర్‌ఎస్ మహిళా సభ్యులపై జరిగిన ఘటనకు సంబంధించిన ఆరోపణలను కూడా పరిశీలిస్తామని స్పీకర్ తెలిపారు. వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

కేటీఆర్, కౌశిక్ రెడ్డి, నవీన్ రెడ్డిపై ఆరోపణలు

అసెంబ్లీ వద్ద కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, నవీన్ రెడ్డిలు పోలీసులపై భౌతిక దాడికి దిగినట్లు స్పష్టంగా కనిపించిందని స్పీకర్ ఆరోపించారు. ఈ ఘటనపై కూడా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.

2014 నిబంధనలనే అమలు చేస్తున్నాం

అసెంబ్లీలో కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధించలేదని గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. 2014లో కేసీఆర్ హయాంలో రూపొందించిన అసెంబ్లీ నిబంధనలనే ప్రస్తుతం అమలు చేస్తున్నామని, టీ-షర్టులపై నినాదాలు ఉండటంతో వాటిని సభలోకి అనుమతించలేదని తెలిపారు.

స్పీకర్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయన్న గడ్డం ప్రసాద్

సభ గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైతే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకునే రాజ్యాంగబద్ధ అధికారాలు స్పీకర్‌కు ఉన్నాయని గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేతలను మర్యాదపూర్వకంగా సంప్రదించే సంప్రదాయంలో భాగంగా కేసీఆర్‌కు కూడా ఫోన్ చేశానని, ఆరోగ్యం బాగుంటే సభకు హాజరవుతానని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana