
DSports 4 Dec:రాయ్‌పూర్: భారత్ (IND), దక్షిణాఫ్రికా (SA) జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో రాయ్‌పూర్ వేదికగా బుధవారం (డిసెంబర్ 3, 2025) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సఫారీలు అద్భుత ప్రదర్శనతో భారత్‌కు షాక్ ఇచ్చారు. మొదట బ్యాటింగ్ చేసి టీమిండియా నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 49.2 ఓవర్లలోనే ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి బౌలింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్, కీలక సమయంలో మంచు ప్రభావం (డ్యూ ఫ్యాక్టర్) ప్రధాన కారణాలుగా నిలిచాయి.
