
DSports 28 Nov:ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ల వివాహంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు తెర పడింది. వాస్తవానికి నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ వాయిదా వెనుక పలాశ్ మోసం చేశాడంటూ కొన్ని రూమర్లు రావడంతో, ఈ వివాదంపై పలాశ్ తల్లి అమిత ముచ్చల్ స్పందించారు.
తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లి వాయిదా పడటానికి గల అసలు కారణాన్ని వెల్లడించడంతో పాటు, “త్వరలోనే వారి వివాహం జరుగుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
