
DET:NOV 12:
శ్రుతి హాసన్ గళంలో మహేష్ బాబు సినిమా పాట:
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న మహేష్ బాబు సినిమా ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఉంది,నుంచి తొలి పాట విడుదలైంది.ఈ పాటను ప్రముఖ నటి,గాయని శ్రుతి హాసన్ ఆలపించారు.ఈ పాట విడుదలతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను శ్రుతి హాసన్, కాలభైరవ కలిసి పాడారు.సంచారి అంటూ సాగే ఈ పాట లిరిక్స్‌లో,మహేష్ బాబు పోషించే అడ్వెంచరర్ పాత్ర గురించి సూచనలు ఉన్నాయి.
కీరవాణితో స్పెషల్ మూమెంట్:
పాట రికార్డింగ్ సెషన్‌కు సంబంధించి శ్రుతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు,వీడియోలను పంచుకున్నారు.ఈ అనుభవం తన జీవితంలోనే చాలా ప్రత్యేకమైన క్షణం అని ఆమె అభివర్ణించారు.మ్యూజిక్ కంపోజర్ ఎం.ఎం.కీరవాణితో కలిసి పనిచేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.కీరవాణి సర్ మ్యూజిక్‌లో పాడటం తనకు దక్కిన గౌరవంగా శ్రుతి పేర్కొన్నారు.
తండ్రి పాటతో సర్ప్రైజ్:
కీరవాణి తన సెషన్‌ను ఎప్పుడూ విఘ్నేశ్వర మంత్రంతో ప్రారంభిస్తారని తాను అనుకున్నానని శ్రుతి హాసన్ తన నోట్‌లో తెలిపారు.అయితే,కీరవాణి కీబోర్డుపై మొదలుపెట్టిన ట్యూన్ విని,అది తన తండ్రి కమల్ హాసన్ సినిమాలోని పాట అని తెలుసుకుని తాను ఎంతో ఆశ్చర్యపోయానని,అది తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణం అని ఆమె రాశారు.కీరవాణి సర్ దయకు,ఆ రోజు మొత్తం టీమ్ చూపిన ప్రేమకు,ఆప్యాయతకు ధన్యవాదాలు అంటూ ఆమె తన హృదయపూర్వక భావాలను పంచుకున్నారు.
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్:
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్,ఫస్ట్ లుక్ రివీల్ కోసం చిత్రబృందం ఒక భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరగనుంది.ఈ వేడుకను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.ఇందులో మహేష్ బాబుతో పాటు,ప్రియాంక చోప్రా,పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
