D Spiritual: Nov 12: ఉన్నత స్థాయికి చేరేందుకు దేవుని ఆశీస్సులు అవసరం
సమాజంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశపడుతుంటాడు. ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడతారు కూడా. అయితే కేవలం కష్టపడటం మాత్రమే కాకుండా, దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి. దేవుని కృపతోనే అనుకున్న లక్ష్యాలు సాకారం అవుతాయి. ఇక ఏ దేవుణ్ణి ఎలా పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయో తెలుసుకుందాం.

విఘ్నేశ్వరుడి పూజ ప్రాధాన్యం
సాధారణంగా ఏ శుభకార్యమయినా, పూజా కార్యక్రమమైనా మొదటగా విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే ప్రారంభిస్తారు. ఎందుకంటే పూజలో ప్రధమ దైవంగా ఆయనను భావిస్తారు. మనం చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు, పనులు నెరవేరకపోతే విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగుతాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా సంకష్టహర చతుర్దశి రోజున విఘ్నేశ్వరుడిని పూజిస్తే, సర్వ దోషాలు తొలగి అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

సంకష్టహర చతుర్దశి పూజ ప్రాముఖ్యం
సంకష్ట చతుర్దశి పూజ ప్రతినెల కృష్ణపక్షంలో, పౌర్ణమి వెళ్లిన నాలుగవ రోజు జరిగే చతుర్దశి రోజున చేయాలి. ఈ రోజున విఘ్నేశ్వరుని 32 స్వరూపాలలో చివరిది అయిన సంకష్ట రూపంకు పూజ చేయడం ఎంతో మంగళకరంగా ఉంటుంది. ఈ రోజు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని విశ్వాసం ఉంది.

పూజ విధానం – స్నానం, ముడుపు, ప్రదక్షిణలు
బహుళ పక్షంలో చతుర్దశి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేయాలి. స్నానానికి నీటిలో నువ్వుల గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎర్రటి గుడ్డ ముక్క తీసుకొని, దానిపై పసుపు, కుంకుమ వేసి మూడు దోసెలతో బియ్యం ఉంచాలి. రెండు తాంబూలాలు, దక్షిణ, ఖర్జూరాలు వేసి స్వామికి ముడుపుగా కట్టాలి. ఆ తరువాత స్వామి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ముడుపును సమర్పించే ముందు మనసులో కోరికను బలంగా కోరుకుని సమర్పించాలి.

ఉపవాసం మరియు సాయంత్రపు పూజ విధానం
ఈ పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం వేళ మళ్లీ తల స్నానం చేసి వ్రతాన్ని ప్రారంభించాలి. ఉదయం కట్టిన బియ్యంతో పాయసం, 21 కుడుములు తయారు చేసి ప్రసాదంగా సమర్పించాలి. పూజలో మొదటగా పసుపుతో వినాయకుడి, గౌరీ రూపాలను రూపొందించి ఆరాధన ప్రారంభించాలి.

వ్రతంలో పాటించాల్సిన నియమాలు
సంకష్టహర చతుర్దశి పూజలో కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. శుద్ధచిత్తంతో, నిష్కామ భావంతో పూజ చేస్తే విఘ్నాలు తొలగి, మనసులో కోరుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana