
DNews Dec12, 2025:హైదరాబాద్: నగరంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) హైదరాబాద్‌లో ఒక ప్రొఫెసర్ దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక గెస్ట్ ఫ్యాకల్టీ మహిళపై అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కీచక ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. యూనివర్సిటీలో మహిళా ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితుడైన ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని పలు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
