
DNews: Dec 12: న్యూఢిల్లీ: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించబడినందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్, గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీని వారి నివాసాల్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముఖ్యాంశాలను వివరించారు. ఖర్గే, ప్రియాంకా గాంధీ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టే ఒప్పందాలు కుదిరినందుకు రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లూ రవి, రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, సురేష్ శెట్టకర్, అనిల్ కుమార్ యాదవ్, పోరిక బాలరాం నాయక్ హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సహా పలువురు ప్రముఖులు ట్రంప్ ప్రతినిధి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌ను అభినందించారు. అనంతరం రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కి వెళ్లి గంటపాటు అక్కడ గడిపారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ఆయనను సమ్మిట్ విజయంపై అభినందించారు. తరువాత ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా, ఆ
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్‌కి వస్తున్నారని, ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని ఆహ్వానించానని వెల్లడించారు. పార్లమెంట్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మెస్సీ హైదరాబాద్‌కి వస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. నేను కూడా అతిథిగా వెళ్తాను. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ మెస్సీ ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు కావడంతో, ప్రభుత్వ తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. రాహుల్, ప్రియాంకా గాంధీని కూడా ఆహ్వానించాను” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
