
DNews: Feb26: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అసెంబ్లీ చర్చలో ఆమె మాట్లాడారు. అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు ఎందుకు ప్రారంభించారని అఖిల ప్రియ ప్రశ్నించారు. మట్టి పనుల పేరుతో దాదాపు రూ. 800 కోట్లు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. జగన్ రాయలసీమకు అన్యాయం చేశారని అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగా రెడ్డి టెండర్లను జగన్ పెద్దిరెడ్డి కంపెనీకి ఇచ్చారని భూమా అఖిల ప్రియ అన్నారు.
