
D News: నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. విజయ్ దేవరకొండతో ‘రణబాలి’, లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’తో పాటు ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే దిగ్గజ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇందులో ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్ర కోసం తొలుత సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు వినిపించాయి. అయితే డేట్స్ సమస్యల కారణంగా రష్మికను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం.
రష్మికనే ఫైనల్ చేశారా?
తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్రకు రష్మిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఆమెతో ప్రోమో షూట్ కూడా పూర్తయినట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం.
ఎప్పుడు అనౌన్స్ చేస్తారు?
రష్మిక నటిస్తున్నట్లు చెబుతున్న ఈ బయోపిక్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా సందర్భంగా లేదా ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి అయిన సెప్టెంబర్ 16న సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం ఇవన్నీ సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మాత్రమే. రష్మికను ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో అధికారికంగా ప్రకటించే వరకు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
