Ramayana: English Version May Be 30 Minutes Shorter? Major Changes Reportedly Made!

D News: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

హిందీ వెర్షన్‌తో పోలిస్తే ఇంగ్లిష్ వెర్షన్ నిడివి దాదాపు 30 నిమిషాలు తక్కువగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని సన్నివేశాలను తొలగించడంతో పాటు.. పాటలను కూడా ఇంగ్లిష్ వెర్షన్‌లో ఉంచకపోవచ్చని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదలైన తొలి పాట ‘జయ జయ రామ్’ మంచి స్పందన అందుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటను అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.

ఈ చిత్రంలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ దియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

By Avinash