
DET:DEC 12:
సూపర్ స్టార్ బర్త్‌డే సందడి జైలర్ 2 సెట్లో!
సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి 75వ పుట్టినరోజు డిసెంబర్ 12.ఈ సందర్భంగా ఆయన అభిమానులు సినీ ప్రపంచం మొత్తం శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే ఈసారి రజినీకాంత్ గారు తన పుట్టినరోజు వేడుకలను ఎక్కడో ఇంట్లోనో,గ్రాండ్గానో కాకుండా తన పని స్థలం జైలర్ 2 సినిమా సెట్లో జరుపుకోవడం విశేషం.ప్రస్తుతం ఆయన మైసూర్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.అక్కడే యూనిట్ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకున్నారు.
కేక్ కటింగ్ యూనిట్ సభ్యులతో ముచ్చట్లు:
సాధారణంగా తన ప్రతి పుట్టినరోజును సింపుల్‌గా సన్నిహితుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడే రజినీకాంత్ ఈసారి కూడా అదే చేశారు.జైలర్ 2 టీమ్ ఆయన కోసం సెట్లో చిన్నపాటి ఏర్పాటు చేసింది.డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఇతర యూనిట్ సభ్యుల సమక్షంలో రజినీకాంత్ గారు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా అక్కడున్న నటీనటులు,టెక్నీషియన్లు అందరూ రజినీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.సెట్లో ఆయన అందరితో సరదాగా మాట్లాడటం వారి ప్రేమను స్వీకరించడం ఆ పండుగ వాతావరణాన్ని మరింత పెంచింది.
రజినీకి అభిమానుల ప్రేమ దర్శకుడికి కానుక:
రజినీకాంత్ గారి పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకు పెద్ద పండుగ.మైసూర్ షూటింగ్ స్పాట్‌కి చాలా మంది అభిమానులు ఆయనను చూడటానికి వచ్చారు.తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు చెప్పడానికి వారి ప్రేమను చాటుకోవడానికి భారీగా చేరుకున్నారు.వారిని చూసి రజినీకాంత్ గారు కూడా చాలా సంతోషించారు.అలాగే జైలర్ 2 సినిమాకు సంబంధించి రజినీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా స్పెషల్ అప్డేట్ లేదా ప్రోమో విడుదల చేస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. దీనిపై నిర్మాతల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జైలర్ 2 పై అంచనాలు:
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.దాని కొనసాగింపుగా వస్తున్న జైలర్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి.రజినీకాంత్ గారు ఈ సినిమా కోసం చాలా ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంటున్నారు. మోహన్‌లాల్,నాగార్జున,బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సీక్వెల్లో కనిపిస్తారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జైలర్ 2 సెట్లో సూపర్ స్టార్ పుట్టినరోజు వేడుకలు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలాయి.
