Raaka Glimpse: The Real Glimpse May Arrive in December.. What Surprise Is Coming Tomorrow?

D News: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన ‘37’ నంబర్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. 3×7=21 అంటూ ఫ్యాన్స్ లెక్కలు వేసుకోవడంతో.. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి భారీ అప్‌డేట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్‌లో అసలైన గ్లింప్స్?

అయితే ‘రాకా’ అసలైన ఫస్ట్ గ్లింప్స్ డిసెంబర్ 2026లో విడుదల కానున్నట్లు సమాచారం. అంటే అల్లు అర్జున్‌ను ఫుల్ యాక్షన్ అవతార్‌లో చూసేందుకు అభిమానులు డిసెంబర్ వరకు ఎదురుచూడాల్సి రావచ్చు. ‘37’ పోస్టర్‌పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 21న గ్లింప్స్ వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇవి ఫ్యాన్స్ లెక్కలకే పరిమితమయ్యాయి.

ఇప్పటికే ప్రమోషనల్ వీడియో

మరోవైపు సెప్టెంబర్ 18న సన్ పిక్చర్స్ ‘రాకా’ నుంచి ఓ చిన్న ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో కథ, పాత్రలు, కీలక విజువల్స్‌ను రివీల్ చేయకుండా పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. ‘గెట్ రెడీ టు విట్‌నెస్ ఏ గ్లోబల్ ట్రయంఫ్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను విడుదల చేశారు.

రేపు ఏ అప్‌డేట్?

సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు కావడంతో ‘రాకా’ నుంచి ప్రత్యేక ప్రమోషనల్ కంటెంట్ వస్తుందనే చర్చ జరుగుతోంది. అట్లీ శిష్యుడు, దర్శకుడు సీబీ చక్రవర్తి సినిమా విజువల్స్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. అట్లీ చూపించిన ‘రాకా’ విజువల్స్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, ‘అవతార్’ విజువల్స్‌తో పోల్చేలా ఉన్నాయని ఆయన చెప్పినట్లు సమాచారం.

ఇక టెక్నికల్ టీమ్‌ను పరిచయం చేస్తూ మేకింగ్ కంటెంట్‌ను విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. అయితే సెప్టెంబర్ 21న మేకర్స్ అసలు ఏం ప్రకటిస్తారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana