
D Educt: Sept 11: ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించిన టెట్ ప్రాథమిక ‘కీ’ని సెప్టెంబరు 15న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ గాజర్ల రమేశ్ తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు.
సెప్టెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించిన ఇన్ సర్వీస్ టెట్ పరీక్షకు మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు.
