D Spiritual: Nov 21: కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అయిన కార్తీక అమావాస్య తరువాత వచ్చే రోజును పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు మహిళలు తెల్లవారుజామునే చెరువులు లేదా నదుల్లో దీపాలు వదులుతూ దీపదానం చేస్తారు. సాధారణంగా ఈ రోజున 30 వత్తులతో దీపాలు వెలిగించడం ప్రత్యేక సంప్రదాయం. ప్రత్యేకంగా అరటి దొప్పలలో దీపాలు వెలిగించి ప్రవహించే నీటిలో వదులుతారు. తరువాత మూడు సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించి పోలి స్వర్గం కథ వింటారు. ఇప్పుడు పోలి పాడ్యమి 2025 తేదీ, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

పోలీ పాడ్యమి యొక్క ప్రాముఖ్యత

కార్తీక మాసమంతా శివ–కేశవుల ఆరాధన, నదీ స్నానాలు, దీపారాధనలు, నోములతో భక్తులు ఆధ్యాత్మికంగా గడుపుతారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి రోజునే పోలి పాడ్యమిని జరుపుకోవాలి.

పోలీ పాడ్యమి 2025 తేదీ

ఈ సంవత్సరం పోలి పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది.
సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉండే రోజునే పోలి పాడ్యమిని జరుపుకోవాలి కాబట్టి నవంబర్ 21వ తేదీ శుక్రవారం పోలి పాడ్యమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

పోలీ పాడ్యమిని పోలి స్వర్గం అని ఎందుకు అంటారు?

పోలీ పాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. పోలి బొందిని తీసుకుని స్వర్గానికి వెళ్లిన రోజు అని నమ్మకం ఉంది. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువుల్లో దీపాలు వదులుతారు. అనంతరం శివాలయాలకు వెళ్లి శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తారు.

30 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు?

కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వారు ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగిస్తే నెలంతా చేసిన దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ దీపాన్ని ప్రవహించే నీటిలో—నది లేదా కాలువలో—వదిలితే శుభఫలం కలుగుతుందని చెబుతారు. అరటి దొప్పలలో దీపాలను పెట్టి నీటిలో వదిలే సంప్రదాయం ఎంతో ప్రసిద్ధం.

పూజా విధానం

దీపారాధన అనంతరం

  • మూడు సార్లు చేతులతో నీటిని ముందుకు తోస్తూ నమస్కరించాలి
  • తరువాత పోలి స్వర్గం కథ వినాలి
  • అక్షింతలు వేసుకోవాలి

ఇది శుభాన్ని పెంచుతుందని పురాణాలు చెబుతున్నాయి.

శుక్రవారం లేదా మంగళవారం పోలీ పాడ్యమి జరుపుకోవచ్చా?

చాలా మంది వారంలో రోజు ఆధారంగా పోలి పాడ్యమి చేయవచ్చా అని సందేహపడుతారు. కానీ పోలి పాడ్యమి వారం కాదు, తిథి ఆధారంగా జరుపుకోవాల్సిన పండుగ.
పాడ్యమి తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమిగా జరుపుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం నవంబర్ 21 శుక్రవారం జరుపుకోవడం శాస్త్రోక్తం.

శుక్రవారం చేయకూడదని అంటున్నవారి అభిప్రాయం

మరికొందరు శుక్రవారం అమ్మవారిని ఇంటి నుంచి పంపకూడదని భావించి శనివారం చేయాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ పండితుల అభిప్రాయం ప్రకారం తిథి ఆధారంగా చూసుకుంటే నవంబర్ 21నే పోలి పాడ్యమి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana