DSports 23Feb 2026:న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో భారత్ కేవలం ఒక జట్టు మాత్రమే కాదు, అదొక ప్రతిభా కేంద్రంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో, వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి క్రికెటర్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

  • “మీరు టీ20 ప్రపంచకప్ చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేక ఆటగాడిపై మీ కళ్లు నిలిచిపోవచ్చు. వారు ధరించిన జెర్సీ మరో దేశానికి చెందినది కావచ్చు, కానీ వారి పేరు వినగానే మన దేశానికి చెందిన వ్యక్తని అర్థమవుతుంది. ఆ సమయంలో మన హృదయం ఎంతో గర్వంతో నిండిపోతుంది” అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ మూలాలను మర్చిపోకుండా, తాము నివసిస్తున్న దేశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
  • ప్రస్తుత టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లలో దాదాపు 40 మందికి పైగా భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా జట్లలో వీరి సంఖ్య అధికంగా ఉంది. ఈ జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్‌లో జన్మించగా, నవనీత్ ధలివాల్, హర్ష్ ఠాకర్ వంటి వారు తమ ప్రతిభను చాటుతున్నారు.
  • అమెరికా జట్టులో 9 మంది భారత మూలాలున్న వారే. కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్ తరపున అండర్-16, అండర్-18 క్రికెట్ ఆడారు. అలాగే సౌరభ్ నేత్రావల్కర్ (ముంబై), హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్ వంటి వారు అమెరికా జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇందులో సాయితేజ ముక్కామల్ల తెలుగు మూలాలున్న ఆటగాడు కావడం విశేషం.
  • ఒమన్ (జతీందర్ సింగ్), న్యూజిలాండ్ (రచిన్ రవీంద్ర, ఈష్ సోధి), దక్షిణాఫ్రికా (కేశవ్ మహారాజ్), నెదర్లాండ్స్, యూఏఈ, ఇటలీ వంటి జట్లలోనూ మన వారు సత్తా చాటుతున్నారు
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana