D-News: విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, సిబ్బంది కొరతపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు ప్రతి నెల యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని ఆదేశించింది. విద్యార్థుల సంక్షేమంతో పాటు కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.

MBBS విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు కాలేజీలు పటిష్టమైన సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని NMC తెలిపింది. క్యాంపస్‌లో లేదా సమీపంలో 24 గంటల వైద్య సహాయం అందుబాటులో ఉండేలా చూడాలి. అలాగే విద్యార్థులకు మానసిక ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు కౌన్సిలర్లను నియమించాలని సూచించింది.

విద్యార్థుల అకడమిక్, మానసిక ఒత్తిడిని కూడా కాలేజీలు ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన సహాయం అందించాలి. విద్యార్థుల హాజరు, అందుబాటులో ఉన్న సిబ్బంది, ముఖ్యంగా బోధనా సిబ్బంది వివరాలను పారదర్శకంగా నిర్వహించి నివేదికల్లో పొందుపరచాలని ఆదేశించింది.

విద్యార్థుల మరణాలపై పూర్తి వివరాలు

మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు లేదా అసహజ మరణాలు జరిగితే వాటిని తప్పనిసరిగా నమోదు చేయాలి. ఏ సంవత్సరం చదువుతున్నారు, ఘటన ఎక్కడ జరిగింది, పోలీసులకు సమాచారం ఇచ్చారా, FIR నమోదైందా, అంతర్గత విచారణ పరిస్థితి ఏంటి వంటి వివరాలను నమోదు చేయాలని NMC పేర్కొంది.

ఖాళీ పోస్టుల భర్తీకి గడువు

కాలేజీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్, కీలక పరిపాలనా పోస్టులను నిర్ణీత సమయంలో భర్తీ చేయాలని NMC ఆదేశించింది. డీన్లు, ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్ల వంటి ముఖ్యమైన పోస్టుల భర్తీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.

పోస్టుల భర్తీ ప్రక్రియ, ఆలస్యానికి కారణాలను కూడా రికార్డుల్లో నమోదు చేయాలి. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, సిబ్బంది సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కాలేజీ యాజమాన్యాలు, రాష్ట్ర వైద్య విద్యా విభాగాలు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను NMC ఆదేశించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana