
DET:NOV 20:
తెలుగు పరిశ్రమకు భాగ్యశ్రీ లాంటి నటి దొరికింది!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన కొత్త సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించారు.వీరిద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు,ఆఫ్-స్క్రీన్ రిలేషన్‌షిప్‌పై కూడా సోషల్ మీడియాలో భారీగా రూమర్లు చక్కర్లు కొట్టాయి.ఈ రూమర్ల నేపథ్యంలోనే ప్రమోషన్స్ సమయంలో రామ్,భాగ్యశ్రీపై చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
భాగ్యశ్రీపై రామ్ ప్రశంసలు పాప లేకపోతే గ్లామర్ ఉండదు:
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని,భాగ్యశ్రీ బోర్సే కలిసి ఇంటర్వ్యూలు,ఈవెంట్లలో పాల్గొన్నారు.ఒక ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా ఫోటోషూట్‌లో రామ్ మాట్లాడుతూ,పాప లేకపోతే గ్లామర్ ఉండదు అని భాగ్యశ్రీని ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్య ద్వారా ఆమె సినిమాకు ఎంత కీలకంగా మారారో,ఆమె ఉనికి స్క్రీన్ పై ఎంత మెరుపు తెస్తుందో రామ్ చెప్పకనే చెప్పారని అభిమానులు భావిస్తున్నారు.ఆమె నటన,స్క్రీన్ ప్రెజెన్స్ తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యిందని ఆయన పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రేమాయణం రూమర్లకు చెక్ పెట్టిన రామ్:
రామ్ పోతినేని,భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. దీనికి కారణం వారిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఒకే హోటల్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేసుకోవడం. అయితే ఈ రూమర్లపై రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.ఈ వార్తల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
భాగ్యశ్రీ కోసం పాట రాయలేదన్న రామ్:
రామ్ తొలిసారిగా ఈ సినిమాలో నువ్వుంటే చాలు అనే పాటను రాశారు.ఈ పాటను భాగ్యశ్రీని దృష్టిలో పెట్టుకునే రాశారని కూడా రూమర్లు పుట్టాయి.దీనిపై రామ్ స్పందిస్తూ,ఆ పాటను నేను రాసినప్పుడు మా సినిమాలో హీరోయిన్ ఎవరో కూడా ఖరారు కాలేదు.అలాంటప్పుడు చూడని అమ్మాయి కోసం నేను పాట ఎలా రాస్తాను? అని ప్రశ్నించారు.ప్రస్తుతం తనకు ప్రేమ లేదా పెళ్లి వంటి విషయాలపై ఎలాంటి ఆసక్తి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
