
DET:NOV 20:
ధురందర్ చిత్రంలోని పాత పాటపై విమర్శలు సుజోయ్ ఘోష్ సమర్థన:
రణవీర్ సింగ్ నటించిన ధురందర్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చినా అందులో ఉపయోగించిన ఒక పాత పాట క్లాసిక్ ఖవ్వాలీ పై కొంతమంది విమర్శలు గుప్పించారు.దీనిపై ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ స్పందించారు.సినిమా యూనిట్‌ను సమర్థిస్తూ,పాత పాటలను రీమేక్ చేయడాన్ని ఆయన ఖండించలేదు.
క్లాసిక్ ఖవ్వాలీపై అభ్యంతరం ఏంటి?
ట్రైలర్ చివర్లో వినిపించే పాట పాత తరం నటీమణుల్లో ఒకరైన మధుబాల నటించిన 1960 నాటి బరసాత్ కీ రాత్ సినిమాలోని ప్రసిద్ధ ఖవ్వాలీ నా తో కర్వాన్ కీ తలాష్ హై.ఈ పాటను మన్నా డే,ఆశా భోస్లే,మొహమ్మద్ రఫీ,సుధా మల్హోత్రా,ఎస్డి బతిష్ వంటి లెజెండరీ గాయనీగాయకులు ఆలపించారు.కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఈ పాట ఒరిజినాలిటీపై ప్రశ్నలు లేవనెత్తారు.ధురందర్ పాట ఒరిజినల్ కాదు,ఇది మన్నా డే గారి పాట యొక్క కొత్త వెర్షన్.సంగీతం విషయంలో బాలీవుడ్లో కొత్తదనం కనిపించడం లేదు అని ఒక యూజర్ కామెంట్ చేశారు.గతంలో కూడా చాలా బాలీవుడ్ సినిమాల్లో ఇలా పాత పాటలను రీమిక్స్ చేయడంపై విమర్శలు వచ్చాయి.
సుజోయ్ ఘోష్ గట్టి సమాధానం:
ఈ విమర్శలకు సుజోయ్ ఘోష్ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.అసలు చర్చ మొదలైంది కూడా ఆయనే.ధురందర్ ట్రైలర్‌ను మెచ్చుకుంటూ,ఈ ధురందర్ ట్రైలర్ చాలా బాగుంది.నా అభిమాన నటీనటులు అందరూ ఒకే సినిమాలో ఉన్నారు.ఇక ట్రైలర్ చివర్లో వచ్చే పాట?అదిరిపోయింది!అని ఆయన ట్వీట్ చేశారు.దానికి పైన చెప్పిన విధంగా అభ్యంతరం రావడంతో సుజోయ్ ఘోష్ బదులిస్తూ దీన్ని ఎవరూ ఒరిజినల్ అని క్లెయిమ్ చేయలేదు.నిజానికి బరసాత్ కీ రాత్ పాటను ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారంటే అది మంచి విషయం అని ట్వీట్ చేశారు.అంటే ఈ పాటను కాపీ చేశామని కానీ కొత్త పాట అని కానీ సినిమా యూనిట్ చెప్పలేదని ఒక క్లాసిక్‌ను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచి పరిణామమని ఆయన ఉద్దేశం.
ధురందర్ సినిమా వివరాలు:
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ ధురందర్ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా,సంజయ్ దత్,ఆర్. మాధవన్,అర్జున్ రాంపాల్ వంటి పెద్ద నటుల బృందం ఉంది.సినిమా స్టోరీ ఒక అండర్ కవర్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5,2025న థియేటర్లలో విడుదల కానుంది.
