
D News : నాని నటించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర మరో ఘనత సాధించింది. నార్త్ ఇండియా హిందీ మార్కెట్లో తొలి వీకెండ్‌కు రూ.7.2 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి.. నాని కెరీర్లోనే అత్యధిక హిందీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. గతంలో వచ్చిన ‘దసరా’, ‘హిట్ 3’ లైఫ్‌టైమ్ వసూళ్లను సైతం ఈ సినిమా అధిగమించింది.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్లో రూ.155 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. కర్ణాటకలోనూ రూ.10 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. ఇక బుక్‌మైషోలో ఇప్పటికే 19.6 లక్షల టికెట్లు అమ్ముడవడంతో.. వీక్డేస్లోనూ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనే ఆసక్తి నెలకొంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాయదు లోహర్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
