
D Educt: Sept 28: ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్లు, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబరు 27న తుది విడత సీట్లను కేటాయించినట్లు టీజీసెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో సెప్టెంబరు 30వ తేదీలోగా చేరాలని అధికారులు సూచించారు. నిర్ణీత గడువులోగా కళాశాలలో చేరి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
