
DSports 19Feb 2026:అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడిన వరుణ్.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రికార్డును సమం చేయడం విశేషం.
- నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కేవలం 3 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అకెర్మాన్, ఆర్యన్ దత్లను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ ఛాన్స్ అందుకున్నాడు. హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ, డచ్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. అంతకుముందు ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ మాక్స్ ఓ డౌడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు.
- 2025 నుండి ఇప్పటి వరకు ఆడిన వరుసగా 17 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ అయినా తీసి అర్ష్‌దీప్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో వరుణ్ మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 5.16 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ అత్యంత పొదుపుగా పరుగులు ఇస్తున్న బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
