
DET:JAN 07:
భారీ రెమ్యునరేషన్ డిమాండ్:
రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్ర కోసం చిత్ర బృందం మోహన్ లాల్‌ను సంప్రదించింది.అయితే కేవలం కొన్ని రోజుల షూటింగ్ ఉన్న ఈ పాత్ర కోసం ఆయన దాదాపు రూ.30 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది విన్న నిర్మాతలు మరియు దర్శకుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని సమాచారం.సాధారణంగా స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ఈ పాత్రను ఆయన చేస్తారని భావించిన మేకర్స్‌కు ఈ భారీ డిమాండ్ పెద్ద షాక్‌గా మారింది.
మారిన బాబీ ప్లాన్స్:
మోహన్ లాల్ అడిగిన అంత పెద్ద మొత్తాన్ని కేవలం గెస్ట్ రోల్ కోసం ఇవ్వడం బడ్జెట్ పరంగా భారమవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీనివల్ల దర్శకుడు బాబీ తన ప్లాన్స్‌ను మార్చుకోక తప్పలేదని తెలుస్తోంది.మోహన్ లాల్ స్థానంలో మరో టాలీవుడ్ స్టార్ హీరోను లేదా ఇతర భాషా నటుడిని తీసుకోవాలని చిత్ర బృందం ఇప్పుడు యోచిస్తోంది.కథలో ఆ పాత్ర చాలా కీలకం కావడంతో సరైన ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది.
అభిమానుల నిరాశ:
చిరంజీవి-మోహన్ లాల్ స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశపడ్డారు.ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమాలో మోహన్ లాల్ నటించిన పాత్రను చిరంజీవి తెలుగులో చేశారు.అప్పటి నుంచే వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే బాగుంటుందన్న కోరిక మెగా అభిమానుల్లో ఉంది.అయితే తాజా పరిణామాలతో ఆ ముచ్చట తీరేలా కనిపించడం లేదు.
సినిమా విశేషాలు:
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అది పూర్తయిన వెంటనే బాబీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.ఈ సినిమాలో చిరంజీవిని పక్కా మాస్ లుక్‌లో చూపించేందుకు బాబీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట.
