DET:JAN 07:
దృశ్యం 3 గ్రాండ్ రిలీజ్ అప్డేట్:
దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు ఘనవిజయం సాధించడంతో మూడో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి.తాజా సమాచారం ప్రకారం మలయాళ వెర్షన్ దృశ్యం 3ని 2026 ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ ఇటీవలే ఒక కార్యక్రమంలో వెల్లడించారు.

హిందీ మరియు తెలుగు వెర్షన్ల పరిస్థితి:
మలయాళ వెర్షన్ ఏప్రిల్‌లో రాబోతుండగా అజయ్ దేవగన్ హీరోగా నటించే హిందీ వెర్షన్ అక్టోబర్ 2,2026న విడుదల కానుంది.ఇక తెలుగు విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ నటించాల్సిన దృశ్యం 3 షూటింగ్ మరికొంత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.వెంకటేష్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో తెలుగు వెర్షన్ 2026 ద్వితీయార్థంలో లేదా చివరలో వచ్చే అవకాశం ఉంది.

కథలో కొత్త మలుపులు:
మూడో భాగం కథ గత రెండు భాగాల కంటే భిన్నంగా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేశారు.జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ఈసారి మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.అయితే రెండో భాగంలో ఉన్నంత ఇంటెలిజెన్స్ సీన్లు ఈసారి ఆశించవద్దని ఇది ఒక కొత్త కోణంలో సాగుతుందని దర్శకుడు ప్రేక్షకులకు ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు.

ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు:
ఈ సినిమా ఇప్పటికే దాదాపు 350 కోట్ల రూపాయల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డు.వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ సిరీస్ మూడో భాగంతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana