Franchise Craze vs Mouth Talk: Two Films, Two Box Office Success Stories!

D News: బాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద ‘మిర్జాపూర్: ది మూవీ’, ‘హనుమాన్ అంశ్’ సినిమాలు సత్తా చాటుతున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల విజయ ప్రయాణం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఒకటి ఫ్రాంచైజీ క్రేజ్‌తో దూసుకెళ్తే.. మరొకటి ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుంది.

‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న విడుదలై తొలి రోజే రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్లు రాబట్టడంతో మూడు రోజుల్లోనే భారత్‌లో రూ.93.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. వరల్డ్‌వైడ్‌గా రూ.132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

మరోవైపు ‘హనుమాన్ అంశ్’ ఆగస్టు 7న విడుదలై తొలి రెండు వారాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే మూడో వారం నుంచి వసూళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. 31 రోజుల్లో భారత్‌లో రూ.122.13 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా.. 32వ రోజుకు ఈ మొత్తం సుమారు రూ.122.53 కోట్లకు చేరినట్లు సాక్‌నిల్క్ గణాంకాలు చెబుతున్నాయి.

ఇలా ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో, మరో సినిమా మౌత్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకోవడం ఆసక్తికరంగా మారింది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana