తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో జూరాల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.

కుడి కాలువకు 350 క్యూసెక్కులు ఎడమ కాలువకు 750 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం కానున్నారు. జూరాలకు నీటి విడుదలతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి కృష్ణా నీటిని విడుదల చేయాలని కోరుతూ మంత్రులు మంగళవారం రాత్రి కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

By Rajini