
D Educt: Nov 9: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను నవంబరు 7వ తేదీన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నవంబరు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో మొత్తం 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం గత నెల 24వ తేదీన రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
