DET:NOV 22:
యూత్ స్టార్ కోసం సూపర్ స్టార్ రంగంలోకి!
యూత్ హీరో నాగ చైతన్య అభిమానులకు ఒక మాస్ అప్‌డేట్! చైతూ నటిస్తున్న కొత్త సినిమా వర్కింగ్ టైటిల్ NC24 యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ను ఇంకెవరో కాదు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు విడుదల చేయబోతున్నారు.ఈ అనౌన్స్‌మెంట్‌తో అక్కినేని ఫ్యాన్స్ మరియు ఘట్టమనేని ఫ్యాన్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

చైతూ బర్త్‌డే గిఫ్ట్ ముహూర్తం ఫిక్స్:

నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.సరిగ్గా ఉదయం 10:08 గంటలకు మహేష్ బాబు చేతుల మీదుగా ఈ లాంఛింగ్ జరగనుంది.ఈ నిధి వేటగాడిని ప్రపంచానికి పరిచయం చేయడానికి గ్లోబ్‌ట్రాటర్ కన్నా గొప్పవారెవరు అంటూ మేకర్స్ తమ అధికారిక ప్రకటనలో పేర్కొనడం ఫ్యాన్స్‌కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

మిస్టికల్ థ్రిల్లర్ ప్యాకేజీ:

NC24 చిత్రం ఒక మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గతంలో విరూపాక్షవంటి సూపర్ హిట్ సినిమా తీసిన కార్తీక్ దండు.ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక హై-బడ్జెట్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ గారు నిర్మిస్తుండగా, సృజనాత్మక దర్శకుడు సుకుమార్ గారు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

అంచనాలు పెంచిన ప్రమోషన్ స్ట్రాటజీ:

మహేష్ బాబు వంటి అగ్ర హీరో ఒక యంగ్ హీరో సినిమా ప్రమోషన్‌లో భాగం కావడం అనేది ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని చూపిస్తోంది. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం నాగ చైతన్య అభిమానులు మాత్రమే కాక, సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 23న విడుదల కానున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చైతూ కొత్త అవతారం ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది.