D Spiritual: Jan 23: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం (Medaram) మహాజాతరను సాఫీగా నిర్వహించేందుకు అధికారులు సమగ్ర ట్రాఫిక్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, వాహనాల రద్దీని నియంత్రించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి ప్రత్యేక మార్గాలను కేటాయించారు. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మెదక్, వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ములుగు, పస్రా మార్గాల మీదుగా మేడారం సమీపంలోని ఊరట్టం స్తూపం వరకు చేరుకోవాలని సూచించారు. ఈ మార్గాలు రద్దీ నియంత్రణకు అనుకూలంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, కాల్వపల్లి మార్గాన్ని వినియోగించి మేడారం వైపు ప్రయాణించాలని సూచించారు. ఈ మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని నియమించి, వాహనాల కదలికలను పర్యవేక్షించనున్నారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం వైపు నుంచి వచ్చే భక్తులు ఏటూరునాగారం, కొండాయి మార్గాల మీదుగా మేడారం చేరుకోవాలని అధికారులు తెలిపారు. అన్ని దిశల నుంచి వచ్చే భక్తులు కేటాయించిన మార్గాలను అనుసరించి ప్రయాణిస్తే రాకపోకలు సజావుగా సాగుతాయని పేర్కొన్నారు.

భక్తులు నిర్దేశిత ట్రాఫిక్ మార్గాలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మహాజాతరను ప్రశాంతంగా, భద్రంగా నిర్వహించేందుకు భక్తుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana