
DET:NOV 14:
అఖండ 2: పై అమెరికాలో అంచనాలు:అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతున్న బాలయ్య సినిమా!
భారీగా వసూళ్లు సాధించిన అడ్వాన్స్ బుకింగ్స్:
నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2: తాండవం సినిమాకు విదేశాల్లో అప్పుడే అద్భుతమైన స్పందన లభిస్తోంది.ఇంకా విడుదల కావడానికి మూడు వారాల సమయం ఉన్నప్పటికీ,ఈ చిత్రం అమెరికా ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లో 42,000 డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఈ స్థాయిలో ముందస్తు బుకింగ్స్ జరగడం చూస్తుంటే,ఓవర్సీస్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏంటో స్పష్టమవుతోంది.
రికార్డుల వేట మొదలు:
సాధారణంగా,పెద్ద సినిమాలు విడుదల తేదీకి కొద్ది రోజుల ముందు మాత్రమే ఈ స్థాయి బుకింగ్స్‌ను చూస్తాయి.కానీ,అఖండ 2 దాదాపు మూడు వారాల ముందు నుంచే ఈ జోరు చూపించడం విశేషం.మొదటి భాగం అఖండ సృష్టించిన ప్రభంజనం కారణంగా,సీక్వెల్‌పై బాలయ్య అభిమానులు,సినీ ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఈ ముందస్తు వసూళ్లు అఖండ 2 ఓవర్సీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నాయి.
సినిమా విశేషాలు,విడుదల తేదీ:
అఖండ 2:తాండవం ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో,మాస్ అంశాలను, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని మేళవించి తీసిన మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు సీక్వెల్లో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు.ఈ చిత్రం డిసెంబర్ 5,2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఇందులో సంయుక్త మరియు ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
బాలయ్య కెరీర్‌కు మరో మైలురాయి:
నందమూరి బాలకృష్ణ గత చిత్రాలు కూడా మంచి విజయాలు సాధించాయి.అఖండ 2 ఆయన కెరీర్లో మరొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌లో వస్తున్న స్పందన చూస్తుంటే,ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు బాక్సాఫీస్‌తో పాటు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు.
