
నటుడిగా దుల్కర్ పీక్ పర్ఫార్మెన్స్:
సినిమా చూసిన నెటిజన్లు,సినీ ప్రియులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను బలంగా తెలియజేస్తున్నారు.వారిలో ఎక్కువ మంది అంటున్న మాట ఒక్కటే:దుల్కర్ సల్మాన్ నటన అద్భుతం,కెరీర్లోనే బెస్ట్.స్టార్ హీరో టి.కె.మహదేవన్ పాత్రలో దుల్కర్ జీవించేశాడని,ఆ పాత్రలోని అహంకారం,ప్రేమ,బాధ వంటి అన్ని భావోద్వేగాలను చాలా పకడ్బందీగా పలికించాడని అంటున్నారు.ఒక నెటిజన్ అయితే వాట్ ఆన్ యాక్టర్!పీక్ పర్ఫార్మెన్స్.ఆయన నటనకు కచ్చితంగా నేషనల్ అవార్డు దక్కాలి!అని పోస్ట్ చేయడం,దానికి చాలా మంది మద్దతు తెలపడం చూస్తుంటే,ఆయన నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
బలమైన కథ,సాంకేతిక విలువలు:
నటీనటుల నటనతో పాటు,ఈ సినిమా కథ,కథనం కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఒక స్టార్ హీరో,అతడికి గురువు అయిన డైరెక్టర్ మధ్య నడిచే ఈగో క్లాష్ సన్నివేశాలు చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు.ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో వచ్చే మర్డర్ మిస్టరీ డ్రామా,ఇన్వెస్టిగేషన్ యాంగిల్ బాగా థ్రిల్‌ను ఇచ్చాయంటున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉందనే మాట వినిపిస్తోంది.డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ,జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయని అంటున్నారు.
సముద్రఖని,రానా పాత్రలకు ప్రశంసలు:
దుల్కర్ సల్మాన్ తో పాటు మిగతా నటీనటులు కూడా అద్భుతంగా నటించారని ఫ్యాన్స్ చెబుతున్నారు.గురువు ‘అయ్య’ పాత్రలో సముద్రఖని నటనకు,అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించిన రానా దగ్గుబాటికి మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని,ముఖ్యంగా రానా దర్యాప్తు చేసే విధానం ఆకట్టుకుందని అంటున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు మంచి అవకాశం దక్కిందని,ఆమె నటన కూడా చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.
