D Spiritual: Dec 6: హిందువులు వారంలో ప్రతి రోజును ఒక దేవుడికి అంకితం చేసి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు వంటి విధంగా శనివారం రోజు శనీశ్వరుడితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున ఆయనను పూజిస్తే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలనుకుంటే కొన్ని నియమాలను పాటించడం మంచిదని శాస్త్రాలు సూచిస్తాయి. ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రపరచాలి. దేవాలయాన్ని లేదా ఇంటి పూజా గదిని శుభ్రం చేసి అలంకరించాలి. ఇంటి వాకిట్లో, పూజా స్థలంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి. పూజ ప్రారంభించే ముందు నుదుటిపై తిరునామం ధరించడం చాలా శ్రేయస్కరం.

తర్వాత స్వామి వారి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. శ్రీనివాసుడికి తులసి దళాలు ఎంతో ఇష్టమైనవి కాబట్టి పూజ సమయంలో తులసి దళాలతో అర్చన చేయాలి. అనంతరం దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామికి పండ్లు, పలాహారాలు సమర్పించాలి. నైవేద్యంగా పులిహోర, పాయసం, పండ్లు, చక్కెర పొంగలి వంటి వాటిని వేయవచ్చు.

ఈ రోజున భక్తులు తప్పనిసరిగా శ్రీనివాసుడి మహిమను వివరిస్తున్న పుస్తకాలను చదవడం శ్రేయస్కరం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నామాలను జపించడం కూడా ఎంతో పవిత్రకరం. శనివారం సాయంత్రం కూడా పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం వేళ బియ్యం పిండితో చేసిన ప్రమిదను వెలిగించడం శుభం అని పండితులు చెబుతున్నారు.

శనివారం నాడు ఒకే పూట భోజనం చేయడం, ఆరోగ్యం అనుకూలిస్తే నేలమీదే నిద్రించడం శ్రేయస్కరం. ఈ రోజున మాంసాహారం తినకూడదు, ఆల్కహాల్ వంటి దోషకరమైన విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలాంటి నియమాలను పాటించి భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై కురుస్తుందని పండితులు చెబుతున్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana