D Spiritual: Dec 2: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ అయ్యప్ప దీక్షను స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల తన నివాసంలో అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో పడి పూజను నిర్వహించిన ఈ ట్యాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఇరుముడితో కలిసి శబరిమల అయ్యప్ప దర్శనానికి బయలుదేరాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ఎన్నో మంది భక్తులు నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్షను స్వీకరించి స్వామి వారి సేవలో నిమగ్నమై ఉంటున్నారు. రోజువారీ అయ్యప్ప సేవలతో పునీతులవుతూ తమ జీవితాన్ని ఆధ్యాత్మికతతో నింపుకుంటున్నారు. ఈ భక్తి ప్రవాహంలో సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు కూడా భాగస్వాములు అవుతున్నారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, రామ్ పొతినేని, వరుణ్ తేజ్, శర్వానంద్, ఎన్టీఆర్, నాని వంటి పలువురు ప్రముఖులు అయ్యప్ప మాలను ధరించి దీక్ష ఆచరించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ టాలీవుడ్‌లో కొనసాగుతుంది.

ఈ క్రమంలో క్రేజీ హీరో వరుణ్ సందేశ్ కూడా అయ్యప్ప మాల వేసుకుని తన దీక్షను ఎంతో భక్తితో కొనసాగిస్తున్నాడు. దీక్ష సమయంలో చేసే పూజలు, కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వరుణ్ సందేశ్ సోషల్ మీడియాలో వరుసగా షేర్ చేస్తూ తన భక్తిని వ్యక్తపరుస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజను అతను ఎంతో ఘనంగా నిర్వహించాడు. ఈ పూజలో అతని భార్య వితికా షేరు తో పాటు వందలాది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. తాజాగా ఇరుముడితో శబరిమల యాత్రకు బయలుదేరిన వరుణ్ సందేశ్, ఆ సందర్భానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇవి నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana