D Spiritual: Nov 4: కార్తీక పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హిందువులు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన 365 వత్తులతో దీపం వెలిగిస్తే, గతంలో చేసిన దోషాలు మరియు ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేయలేని లోపం పరిహారమవుతాయని చెబుతారు.

కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన కూడా, ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేసి, శివ–కేశవులను పూజించడం ఆనవాయితీగా కొనసాగుతుంది.

సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగం. అయితే ప్రస్తుత కలియుగ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యం కాదు. ఒకరోజు దీపం వెలిగించి, మరుసటి రోజు వేయకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి.

సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. అందువల్ల రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే, ఆ ఒక్కరోజు దీపం వెలిగించినా ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుందని నమ్మకం.

కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు భూమిపైకి వచ్చి దీపారాధనలను దర్శిస్తారని చెబుతారు. 365 వత్తులతో దీపం వెలిగించి వారిని ఆహ్వానించి, పూజలు చేయడం ద్వారా వారి ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసిస్తారు.

ఈ పవిత్ర రోజున 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, అలాగే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితమంతటి పుణ్యం దక్కుతుందని పురాణాలు పేర్కొంటాయి.

దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని పండితులు చెబుతున్నారు. కాబట్టి 365 వత్తులతో దీపం వెలిగించి, దానధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి, భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, సంపద ప్రసాదిస్తుందని నమ్మకం.

ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. ఈ దీపాలను చూసినవారి పాపాలు పటాపంచలై, జీవితాంతరం వారికి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి, కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయాన దీపారాధన చేయడం అత్యంత శ్రేష్ఠమని సూచిస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana