
DSports 4 Dec:జెరూసలేం: భారత చెస్ క్రీడలో కొత్త తరానికి, పాత తరానికి మధ్య జరిగిన అద్భుత పోరులో యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి పైచేయి సాధించాడు. తెలంగాణకు చెందిన అర్జున్ ఎరిగైసి, చెస్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ప్రతిష్టాత్మక జెరూసలేం మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
డిసెంబర్ 3, 2025 (బుధవారం) రాత్రి జరిగిన ఈ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో, 22 ఏళ్ల అర్జున్ ఎరిగైసి తన నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచాడు.
