DNews:02 Dec:హైదరాబాద్‌, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షల రిజిస్ట్రేషన్లు నవంబర్ 27తో ముగిసిన నేపథ్యంలో, దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చివరి అవకాశం కల్పించింది.దరఖాస్తుల్లోని వివరాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే, అభ్యర్థులు డిసెంబర్ 2వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే సవరించుకునేందుకు అవకాశం ఉంది.గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరో అవకాశం ఇవ్వబడదని NTA స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు సమయంలో తప్పుగా నమోదు చేసిన వివరాల సవరణకు కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.

ఏ వివరాలు మార్చవచ్చు, వేటిని మార్చలేరు?

మార్చడానికి అవకాశం ఉన్న వివరాలు : అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే.పుట్టిన తేదీ, జెండర్‌, కేటగిరీ, సబ్‌ కేటగిరీ/పీడబ్ల్యూడీ పదో తరగతి, 12వ తరగతికి సంబంధించిన వివరాలు, పాన్‌ కార్డు నంబర్‌, ఇతర గుర్తింపు వివరాలు పరీక్ష రాయాలనుకొనే నగరం, పరీక్ష మాధ్యమం సంతకం.

మార్చడానికి వీలు లేని వివరాలు:మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ అడ్రస్‌ (శాశ్వత/ప్రస్తుత) ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటో

పరీక్ష షెడ్యూల్ వివరాలు:

జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 30వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు.జనవరి 2026 మొదటి వారంలో అందుబాటులో ఉంచుతారు.జనవరి 2026 మూడో వారంలో విడుదల చేస్తారు.తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేస్తారు.

అభ్యర్థులు తమ సన్నద్ధతను షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలని, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సూచించారు. ముఖ్యంగా, పరీక్షలకు కాలిక్యులేటర్‌ తీసుకొచ్చేందుకు అనుమతి ఉండదని NTA స్పష్టం చేసింది. JEE స్కోర్ ద్వారా NIT, IIT, GFTI వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana