DSports Dec17 2025: గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నాలుగో టీ20 కోసం తుది జట్టులోకి వస్తున్నట్లు సమాచారం. సిరీస్‌ను ఇక్కడే ముగించాలని భావిస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ జట్టులో ఉండటం చాలా అవసరమని భావిస్తున్నారు. బుమ్రా రాకతో పేస్ విభాగం మరింత పటిష్టంగా మారింది.

నలుగు టీ20 – భారత అంచనా తుది జట్టు (Probable XI):
అభిషేక్ శర్మ: గత మ్యాచ్ సెంచరీ హీరో, అదే ఊపును కొనసాగించాలని చూస్తున్నాడు.

శుభ్‌మన్ గిల్: నిలకడైన ఆరంభాన్ని ఇవ్వడం గిల్ లక్ష్యం.

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్): మిడిల్ ఆర్డర్‌లో భారీ స్కోరు సాధించాల్సిన ఒత్తిడిలో ఉన్నాడు.

తిలక్ వర్మ: గత మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ ప్లేయర్ స్థానం పక్కా.

హార్దిక్ పాండ్యా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు.

రింకూ సింగ్: ఫినిషర్ పాత్రలో మెరుపులు మెరిపించాల్సి ఉంది.

అక్షర్ పటేల్: స్పిన్ మరియు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో కీలకం.

రవి బిష్ణోయ్: లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి ఇతని పాత్ర కీలకం.

జస్ప్రీత్ బుమ్రా: స్టార్ బౌలర్ తిరిగి రావడంతో అర్ష్‌దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.

అర్ష్‌దీప్ సింగ్: డెత్ ఓవర్లలో బుమ్రాతో కలిసి సఫారీలను కట్టడి చేయనున్నాడు.

వరుణ్ చక్రవర్తి: ఈ సిరీస్‌లో వికెట్ల వేటలో ఉన్న మిస్టరీ స్పిన్నర్.