
D News: సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఎస్.జే. సూర్య పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ విడుదల చేసిన క్యారెక్టర్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘బోధి’గా ఎస్.జే. సూర్య
‘జైలర్ 2’లో ఎస్.జే. సూర్య ‘బోధి’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన ప్రోమోలో ఆయన లుక్, కారు దిగి వచ్చే విధానం, బాడీ లాంగ్వేజ్, స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్రలోని వైలెంట్ షేడ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
రజినీకాంత్ ముత్తువేల్ పాండియన్‌గా మరోసారి కనిపించనున్న ఈ సినిమాలో బోధి పాత్ర ఎలాంటి సవాల్ విసరబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. రజినీకాంత్, ఎస్.జే. సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
అనిరుధ్ BGM హైలైట్
ప్రోమోకు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎస్.జే. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్‌కు అనిరుధ్ మ్యూజిక్ మరింత ఎలివేషన్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
