
DNews: Jan12:జగన్ అమరావతిని నిర్వీర్యం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఇది హాస్యాస్పదమని సీపీఐ జాతీయ నియంత్రణ కమిషన్ చైర్మన్ కె. నారాయణ అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన వారాహి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆయన కోడిపందేలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని అన్నారు. చంద్రబాబు అవసరం మేరకు మోడీతో కలిసి ఉన్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ, నెహ్రూలను చరిత్ర నుండి తుడిచిపెట్టడానికి మోడీ కుటుంబం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిధులలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా మార్పులు చేయడం కేవలం పథకాన్ని రద్దు చేయడానికేనని అన్నారు.
