
విద్యార్థులు, పిల్లలు, పెద్దల నుంచి కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసే ఉద్యోగుల వరకు లక్షలాది మంది ప్రతిరోజూ కళ్లజోడు ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది ఫ్రేమ్ అందంగా ఉందా? ధర ఎంత? అనే విషయాలనే ఎక్కువగా చూస్తారు. కానీ సరైన పవర్, లెన్స్ నాణ్యత, ఫ్రేమ్ సౌకర్యం వంటి అంశాలను పట్టించుకోకపోతే కళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే కొత్త కళ్లజోడు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం.
కానీ సరైన పవర్, లెన్స్ నాణ్యత, ఫ్రేమ్ సౌకర్యం వంటి అంశాలను పట్టించుకోకపోతే కళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కళ్లజోడు ఎంపికలో చిన్న పొరపాటు చేసినా తలనొప్పి, కళ్లపై ఒత్తిడి, చూపు మసకబారడం, అసౌకర్యం వంటి సమస్యలకు కారణమవుతుంది. అందుకే కొత్త కళ్లజోడు కొనేప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి కళ్లజోడు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చాలామంది కొత్తజోడు తీసుకునేప్పుడు పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా కొత్తది తీసుకుంటారు. అయితే ఇలా చేయకూడదని నిపుణులు అంటున్నారు. కంటి చూపు కాలక్రమంలో మారవచ్చు. అందుకే ముందుగా కంటి వైద్యుడు లేదా ఆప్టోమెట్రిస్ట్తో పరీక్ష చేయించుకుని ప్రస్తుత పవర్ తెలుసుకోవాలి. పవర్ తప్పుడుగా ఉన్న కళ్లజోడు వాడితే తలనొప్పి, కళ్ల నొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు రావచ్చు.
