D Spiritual: Feb 10: అమెరికా అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, డాలర్ల కలలు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ ఇంజనీర్ల కంటే మన దేశానికి చెందిన అర్చకులకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. టెక్ రంగాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్న స్థాయిలో పూజారుల సంపాదన పెరిగింది. పెద్దగా చదువు లేకపోయినా, తీవ్రమైన పోటీ లేకుండానే ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

అమెరికాలోని హిందూ ఆలయాల్లో అర్చకులకు ఇస్తున్న జీతాలు సామాన్యంగా లేవు. కొత్తగా ఉద్యోగంలో చేరిన అర్చకులకే ఏడాదికి 30 వేల నుంచి 45 వేల డాలర్లు వరకు జీతం ఇస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 25 నుంచి 37 లక్షల రూపాయలు. ఇక అనుభవం, సీనియారిటీ ఉన్న అర్చకులు ఏడాదికి 80 వేల నుంచి లక్ష డాలర్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇది దాదాపు 80 లక్షల రూపాయలకు సమానం.

జీతంతో పాటు అర్చకులకు మరెన్నో సౌకర్యాలు కూడా లభిస్తున్నాయి. ఆలయ నిర్వాహకులే ఉచితంగా నివాస వసతి కల్పించడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నారు. దీంతో జీతంలో నుంచి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండటం లేదు. ఇది వారి ఆదాయాన్ని మరింత పెంచే అంశంగా మారింది.

దీనికి తోడు పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తులు అందించే దక్షిణ కూడా డాలర్లలోనే ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ పూజలు అర్చకులకు అసలైన ఆదాయ వనరుగా మారాయి. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు కొత్త ఇల్లు కొనుగోలు చేసినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భాల్లో చేసే సత్యనారాయణ వ్రతాలు, చిన్న పూజలకే 5 వేల నుంచి 10 వేల డాలర్లు వరకు ముట్టజెబుతున్నారట.

ఇక వివాహాలు, పెద్ద హోమాలు వంటి కార్యక్రమాలకు అర్చకుల ఆదాయం మరింత పెరుగుతుంది. పెళ్లిళ్లు లేదా విశేష హోమాలకు కొందరు అర్చకులు 20 వేల నుంచి 40 వేల డాలర్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తాలు ఉన్న నెలల్లో అర్చకుల నెలవారీ ఆదాయం భారతీయ కరెన్సీలో 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటోందని చెబుతున్నారు. ఈ స్థాయిలో సేవింగ్స్ చేయడం ఐటీ ఉద్యోగులకు కూడా కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తమ కెరీర్ దిశను మార్చుకుంటున్నారట. ఐటీ రంగంలో ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుండటంతో, అమెరికాలో చదువుతున్న కొందరు భారతీయ విద్యార్థులు పార్ట్‌టైమ్ పూజారులుగా మారుతున్నారు. భక్తితో పాటు మంచి ఆదాయం లభించడం, పోటీ తక్కువగా ఉండటం వల్ల వీసా సమస్యలు కూడా పెద్దగా ఎదురవడం లేదని సమాచారం. ఇప్పటికే గ్రీన్ కార్డులు పొందిన అర్చకులు కూడా చాలామందే ఉన్నారు.

మొత్తానికి అమెరికాలో ఇప్పుడు కోడింగ్ తెలిసినవాళ్ల కంటే వేదాలు తెలిసినవాళ్లకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. టెక్నాలజీ యుగంలోనూ సంప్రదాయానికి ఉన్న విలువను ఈ పరిణామం స్పష్టంగా చూపిస్తోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana