DNews: Nov 18: హైదరాబాద్ నగరంలో మరోసారి ఆదాయపు పన్ను శాఖ (IT) దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ హోటల్స్‌ అయిన పిస్తా హౌస్, షాగౌస్, మేహఫిల్ యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. పిస్తా హౌస్ యజమాని మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ నివాసాల్లో రాజేంద్రనగర్ ప్రాంతంలో నాలుగు టీములు తనిఖీలు చేపట్టాయి. ఉద్యోగుల నివాసాలు, వసతి గృహాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, రికార్డుల్లో చూపిన ఆదాయానికి, వాస్తవ ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ట్యాక్స్ చెల్లింపుల్లో కూడా అసమతుల్యతలు ఉన్నట్లు వెల్లడించారు. హార్డ్‌డిస్క్‌లలో ఉన్న డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇక మేహఫిల్ రెస్టారెంట్ షేక్‌పేటప్రాంతంలో కూడా ఐటీ దాడులు జరిగాయి. మొత్తం 15 హోటల్స్‌ను నిర్వహిస్తున్న మేహఫిల్ సంస్థపై రెండు టీములు తనిఖీలు చేపట్టాయి. ఆదాయం, ఖర్చులు, పన్నుల చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలనలో ఉన్నారు. వాస్తవ ఆదాయానికి, రికార్డుల్లో చూపిన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. షాగౌస్ హోటల్స్‌ యజమానుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ హోటల్స్‌ ప్రతి సంవత్సరం వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana